Sunday, May 19, 2024

రేపు మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో సిఎం పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున రేపటి నుంచి తన ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. బహిరంగ సభలు, రోడ్డు షోలతో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు సిఎం రేవంత్ సిద్ధం అయ్యారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌లో అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ ర్యాలీలో సిఎం పాల్గొని, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే సభ కు సిఎం బయలుదేరి వెళ్లనున్నారు.

ఇక రేపటి నుంచి సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 20వ తేదీన మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సిఎం హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ నెల 21వ తేదీన చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొంటారు. 22వతేదీ ఉదయం ఆదిలాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్ సభలో సిఎం పాల్గొంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News