Saturday, August 16, 2025

ఎప్పటికప్పుడు జలాశయాలను అధికారులు పరిశీలిస్తూ ఉండాలి: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వర్షాల ప్రభావం ఎక్కువుగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉంచాలని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఎన్ డిఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సిఎం మాట్లాడారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. వాగులు పొంగే ప్రమాదమున్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని రేవంత్ తెలియజేశారు.

పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని, నగర, పురపాలక, గ్రామాల పరిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు (Sanitation work) చేపట్టాలని అన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు తగినన్ని ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులతో చెప్పారు. హైదరాబాద్ లో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని, జిహెచ్ఎంసి, హైడ్రా, ఎస్డిఆర్ఎఫ్, అగ్ని మాపకశాఖ తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News