Sunday, September 15, 2024

‘కమిటీ కుర్రోళ్లు’ తీసినందుకు గర్వంగా ఉంది: నిహారిక

- Advertisement -
- Advertisement -

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కింది. ఇంత భారీ విజయాన్ని ఆడియెన్స్ అందించడంతో శనివారం నాడు సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ “ఇది పీపుల్స్ సినిమా అయింది.

ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది” అని అన్నారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. “నిహారిక ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీని చూసిన వాళ్లు మలయాళీ చిత్రమని అంటున్నారు. కానీ నిహారిక లాంటి నిర్మాతలు ఉంటే.. ఇలాంటి చిత్రాలు తెలుగులోనే ఇకపై వస్తాయి. సినిమాలోని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా నటించాడని చెబుతుంటే నాకు ఎంతో ఆనందమేసింది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జయ అడపాక, అంకిత్ కొయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News