Saturday, April 27, 2024

పేదలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ పాలనా : ప్రధాని మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

జైపూర్ : కాంగ్రెస్ తన పాలనాకాలంలో పేదరికం నిర్మూలిస్తామని చెప్పి పేద ప్రజలను తప్పుదోవ పట్టించిందని, అదే తన పాలనా విధానంగా అనుసరించిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ధ్వజమెత్తారు. “ ఏభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నుంచి వెనక్కు తిరిగి పేదలకు పెద్ద మోసమే చేసింది. ఈ కారణంగా రాజస్థాన్ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారు” అని అజ్మీర్‌లో ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలన పేద ప్రజల సేవలకు అంకితమైందని, చక్కని పరిపాలన, పేదల సంక్షేమం కోసం పాటుపడినట్టు చెప్పారు. 2014 కు ముందు కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని సాగించినప్పుడు అవినీతికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావడంతో ప్రధాన నగరాలు స్తంభించిపోయాయని తెలిపారు.

తన పాలనలో కాంగ్రెస్ అవినీతి వ్యవస్థని పెంచి పోషించిందని, అది దేశం రక్తాన్ని పీల్చివేసిందని, అభివృధ్ధి వెనక్కు పోయిందని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ప్రజలు భారత్ గురించి మాట్లాడుకుంటున్నారని, కటిక పేదరికాన్ని అంతమొందించడానికి బాగా చేరువైందని నిపుణులు చెబుతున్నారని మోడీ పేర్కొన్నారు. అంతకు ముందు ప్రధాని అజ్మీర్ జిల్లా పుష్కర్‌లో ప్రఖ్యాతి చెందిన బ్రహ్మాలయంలో పూజలు చేశారు. అక్కడ నుంచి జైపూర్ రోడ్‌లో కయాడ్ విశ్రామ్ స్థలికి హెలికాప్టర్‌లో ప్రయాణించి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అర్జున్‌రామ్ మెఘ్వాల్, కైలాస్ చౌదరి, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేతలు ప్రధానిని అనుసరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News