Thursday, October 10, 2024

దుబ్బాకలో కాంగ్రెస్, బిఆర్ఎస్ వర్గాల రగడ

- Advertisement -
- Advertisement -

దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ వర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో నేడు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, స్థానిక బిఆర్ఎస్ ఎంఎల్ఏ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అయితే అధికారిక కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడాన్ని బిఆర్ఎస్ వర్గాలు తప్పుబట్టాయి. వేదికపై శ్రీనివాస్ రెడ్డి ఉండవద్దని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.

ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులతో పాటు బిజెపి నేతలు కూడా పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. చివిరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అధికారిక కార్యక్రమం కావడంతో చివరకు వేదిక మీది నుంచి శ్రీనివాస్ రెడ్డి దిగిపోయారు. రసాభాస మధ్య మంత్రి సురేఖ చెక్కులను పంపిణీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News