Tuesday, April 23, 2024

పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. పార్టీ రా ష్ట్ర ఇంచార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షీ పార్లమెంటు వారిగా ఇంచార్జీలను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వు లు జారీ చేశారు. వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(ఖమ్మం), ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), దుద్దిళ్ళ శ్రీధర్ బాబు (పెద్దపల్లి), రేవూరి ప్రకాశ్ రెడ్డి (వరంగల్), తుమ్మల నాగేశ్వరరావు (మహబూబాబాద్),ఒబేదుల్లా కోత్వాల్ (హైదరాబాద్),

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (సికింద్రాబాద్) , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (భువనగిరి), జూపల్లి కృష్ణారావు (నాగర్‌కర్నూల్), ఎస్.ఎ.సంపత్ కుమార్ (మహబూబ్‌నగర్), వేంనరేందర్ రెడ్డి (చేవెళ్ల), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజ్‌గిరి), కొండా సురేఖ (మెదక్), పి.సుదర్శన్ రెడ్డి (నిజామాబాద్), డి.అనుసూయ సీతక్క (ఆదిలాబాద్),దామోదర్ రాజనర్సింహా (జహీరాబాద్)లను నియమిం చారు.అయితే తొమ్మిది నియోజకవర్గాలకు ఎఐసిసి ఇన్‌చార్జిగా రోహిత్ చౌదరి, మరో ఎనిమిది నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా పిసి విష్ణునాథ్ వ్యవహరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News