Monday, April 29, 2024

ఆప్‌తో చేతులు కలిపిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కలసి పోటీ

న్యూఢిల్లీ: బిజెపి, ప్రతిపక్ష ఇండియా కూటమి మొట్టమొదటిసారి ముకాముఖీ ఎన్నికల్లో తలపడనున్నాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మొడటిసారి నేరుగా ఈ రెండు పక్షాలు తలపడనున్నట్లు ఆప్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దా మంగళవారం తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలే పునాది రాయి కాగలవని ఆయన విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు. జనవరి 18న జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం ఖాయమని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి, బిజెపి మొదటిసారి ప్రత్యక్షంగా తలపడుతున్నాయని ఆయన చెప్పారు.

ఆప్, కాంగ్రెస్ కలసికట్టుగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు ప్రీఫైనల్స్ లాంటివని ఆయన చెప్పారు. మేయర్ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలుసుకుని ఎన్నికల్లో కలసి పోటీ చేయడంపై చర్చలు జరిపారని ఛద్దా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి ఉంటారని, ఇద్దరు డిప్యుటీ మేయర్ అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి ఉంటారని ఆయన ప్రకటించారు.

రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మేయర్ అభ్యర్థిగా ఆప్‌కు చెందిన కుల్దీప్ కుమార్ టీటా పోటీ చేస్తారని, సీనియర్ డిప్యుటీ మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గుర్‌ప్రీత్ సింగ్ గాబి, డిప్యుటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన నిర్మలా దేవి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్న ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ ముందుగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.

35 మంది సభ్యుల చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బిజెపికి 14 మంది కౌన్సిలర్లు ఉండగా ఓటింగ్ హక్కులుగల పార్లమెంట్ సభ్యుడు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్నారు. కాగా..ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌కు ఒక కౌన్సిలర్ ఉన్నారు. ఆప్, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తున్న ఎన్నికల్లో ఇండియా కూటమికే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News