Monday, October 14, 2024

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ ప్రయత్నం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగాప్రతిపక్షాలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీ నేతలతో సంప్రతింపులు జరుపుతున్నట్లు తెలిపారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ప్రధాన అంశంగా అవిశ్వాసం తీర్మానంలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పరువు నష్ట కేసులో సూరత్ కోర్టు తీర్పును ప్రకటించిన గంటల వ్యవధిలోనే అనర్హత వేయడం రాజకీయ ప్రతీకార చర్యగా ఆరోపించాయి.

అయితే సభా కార్యక్రమాలు సజావుగా జరిగినప్పుడే ధావిశ్వాస తీర్మానంప్రవేశపెడతామని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలంటే సుమారు 50మంది ఎంపిలు మద్దతు ప్రకటిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. 1963 ఆగస్టులో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆచార్య కృపలాని తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News