Tuesday, March 18, 2025

మహిళా సాధికారతకు తెలంగాణ పట్టం

- Advertisement -
- Advertisement -

మహిళా దినోత్సవం సందర్భంగా నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ
బహిరంగ సభ హాజరుకానున్న లక్ష మంది మహిళలు ఇందిరా
మహిళాశక్తి విజన్2025ను ఆవిష్కరించనున్న సిఎం పలు కొత్త
పథకాలకు శ్రీకారం ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్/సికింద్రాబాద్: రా ష్ట్రంలో మహిళా సాధికారితకు అత్యంత ప్రాధాన్య త ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ మ హిళా దినోత్సవం రోజు ఈ నెల 8 శనివారం నాడు మరిన్ని పథకాలను ప్రకటించనుంది. ‘ఇందిరా మ హిళా శక్తి మిషన్- 2025’ పేరుతో ఆవిష్కరిస్తున్న ట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ మహి ళా దినోత్సవ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వేదికగా ‘ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025’ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పలువు రు ఎమ్మెల్యేలు తదితరులు ఈ సభలో పాల్గొననున్నా రు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుం చి దాదాపు లక్ష మంది మహిళలను ఆహ్వానించా రు.

ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృం దాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాల ను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ – 2025 ను ప్రభుత్వం రూపొందించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క ఆధ్యక్షతన ఈ భారీ సభ జరగనుంది. మహిళా సంఘాలు ఈ ఏడాది సా ధించిన విజయాలతో పాటు, మహిళా సాధికారత బలోపేతం కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025లో పొందు పరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందు కు 32 జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున విచ్చేస్తుండడటంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మంత్రి సీతక్క పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పరిశీలించారు.

‘ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025’ ఆవిష్కరణలో ముఖ్యాంశాలు:
రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనున్న ‘ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025’లో భాగంగా ప్రకటించే కొత్త పథకాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి జిల్లాల్లో మహిళా సంఘాలచే ఏర్పాటు కాబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. మొత్తం 32 జిల్లాల్లో జిల్లాకు 2 మేగా వాట్ల చొప్పున మొత్తం 64 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. దీనిలో భాగంగా మొదటి విడతలో 150 ఆర్టీసీ అద్దె బస్సులకు పచ్చా జెండా ఊపి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరిగాయి. వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు అందచేస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘ సభ్యులకు రూ.40 కోట్ల ప్రమాధ భీమా చెక్కులను పంపిణీ చేస్తారు. నారాయణపేట జిల్లాల్లో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోనే మిగిలిన 31 జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులు ప్రారంభించేలా బీపీఎల్, హెచ్ పీ సీఎల్ , ఐఓసీఎల్ వంటి అయిల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందాలు జరుగుతాయి. ఇందిరా శక్తి భవనాల నిర్మాణం, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి బజార్లు ప్రారంభం వంటివి జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది.

అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫాం కుట్టడం, అమ్మ ఆదర్శ పాఠశాలల ఏర్పాటు, ప్రమాద బీమా, రుణ బీమా కల్పించడం, సంచార చేపల విక్రయ అవుట్‌లెట్‌ల ఏర్పాటు వంటి అంశాలను ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025లో భాగంగా ప్రకటిస్తారు. వీటిలో ఇప్పటికి కొన్ని అమలు జరుగుతుండగా, మరికొన్నింటిని కొత్తగా అమలు చేస్తూ శ్రీకారం చుడుతూ అన్నింటిని కలిపి ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 14 వేలకు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను ఈ వేదికపై నుంచి ప్రకటించే అవకాశం ఉంది. 17 రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రొత్సహిస్తూ రూ.22 వేల కోట్ల రుణాలు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ వివరాలను సైతం వెల్లడించనున్నారు. ఐటీ కారిడార్‌లో మూడెకరాల స్థలంలో రూ.9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు, సబ్సిడీలో ఈ-ఆటోలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక్కో ఆటో ఖర్చు మూడున్నర లక్షలు, లక్ష రూపాయలు భరించే యోచనలో ఉంది. ఉచితంగా మహిళలకు ఆటోలను నడపడంలో శిక్షణ తదితర అంశాలను కూడా ఈ వేదికపై ప్రకటించే అవకాశం ఉంది.

ఏర్పాట్లు పరిశీలించిన సీతక్క
పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ ఏర్పాట్లు యుద్ద్ధ ప్రాతిపదిన కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని విభాగాలు సమన్వయంతో చేసుకుంటూ బహిరంగ సభకు హాజరయ్యే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు, మున్సిపల్ యంత్రాంగం సభ ఏర్పాట్లలో పాల్గొని సభకు వచ్చే అతిధులు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీరు, లైటింగ్ వంటి సదుపాయాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేసవికి సభకు వచ్చే మహిళలకు ఎండదెబ్బ తగుల కుండా షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష మంది మహిళలు సభకు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం బహిగరం సభ జరుగనున్న పరేడ్ గ్రౌండ్స్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందుతు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, మహిళలకు అసౌకర్యం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృషి పెట్టాలని ఆదేశించారు. మహిళా శక్తిని చాటే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వమే ముందుండి అధికారికంగా సభను నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సభను నిర్వహిస్తామన్నారు. అన్ని రంగాలలో మహిళలు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్షమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News