Saturday, April 27, 2024

అవినీతిపరులంతా బిజెపిలోనే ఉన్నారు

- Advertisement -
- Advertisement -

భారతదేశంలోని అత్యంత అవినీతిపరులను బిజెపి చేర్చుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో గనుల దిగ్గజం గాలి జనార్దన రెడ్డిని తిరిగి బిజెపి చేర్చుకోవడంపై కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల బాణాన్ని సంధించింది. దేశంలోనే అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడిన గాలి జనార్దన రెడ్డికి రెడ్ కార్పెట్ వేసి పారీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీవి డొల్ల మాటలని తేలిపోయిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. జనార్తన రెడ్డి తనకెఆర్‌పిపి పార్టీని బిజెపిలో విలీనం చేయడంతోపాటు తన భార్య అరుణ లక్ష్మి, కొందరు కుటుంబ సభ్యులతో కలసి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యూడియూరప్ప,

బిజెపి కర్నాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర సమక్షంలో బిజెపిలో చేరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా దీనిపై స్పందించారు. దేశంలోని అత్యంత అవినీతిపరులైన రాజకీయ నేతలు బిజెపిలో చేరిపోయారని, ఇడి, ఐటి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ చేరికలని ఆయన ఆరోపించారు. ఎన్నికల బాండ్ల కుంభకోణంతోపాటు బిజెపిలో జజరుగుతున్న తాజా పరిణామాలు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా దేశంలో అవినీతి సర్వసాధారణం చేసేశారని వెల్లడిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బిజెపికి లభించే కార్పొరేట్ విరాళాలు, రాప్ట్రప్రభుత్వాలను కూల్చడానికి జరిగే ప్రయత్నాలు, విలీనాలు, స్వాధీనాలు ఇవన్నీ ధన బలంతో బిజెపి సాగించే అకృత్యాలకు నిదర్శనాలని జైరాం రమేష్ ఆరోపించారు. ్చందా వసూలు చేయడం, దందాలు చేయడం, అందరికీ తినిపించడం ప్రధాని నరేంద్ర మోడీ నిరంతర నినాదమని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News