Thursday, June 13, 2024

ఖమ్మంలో కాంగ్రెస్, భువనగిరిలో బిజెపి అధిక్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని లోక్ సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ -బిజెపిలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలో బిజెపి ఐదు స్థానాలలో ముందంజలో ఉండగా కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు స్థానాలలో ముందంజలో ఉంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామి రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రఘురామి రెడ్డి తొలి రౌండ్‌లో 19, 935 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భువనగిరిలో బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌లో బిజెపి అభ్యర్థి డికె అరుణ, మల్కాజ్‌గిరిలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్, కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్‌లో బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి, నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News