Saturday, April 20, 2024

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలు గెలుస్తాం: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 స్థానాలు సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సన్నాహాలపై సోమవారం సమావేశం నిర్వహించిన తరువాత మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో అఖండ విజయం సాధించిన రీతి లోనే మధ్యప్రదేశ్‌లో కూడా అవే ఫలితాలు పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ అగ్రనాయకులతో సమావేశం అయ్యారు. పార్టీ నేతలంతా సమష్టిగా ముందుకు వెళ్లాలని సూచించారు.

మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఛీఫ్ కమల్‌నాథ్, ఎఐసిసి ఇన్ ఛార్జి పి అగర్వాల్, కెసి వేణుగోపాల్ సమావేశంలో పాల్గొన్నవారిలో ఉన్నారు. “ కర్ణాటకలో తాము 138 స్థానాలు పొందగలిగామని, మధ్యప్రదేశ్‌లో 150 స్థానాలు సాధించ గలమన్నది తమ అంచనా” అని రాహుల్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉన్నాయి. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్ నాథ్ కాబోతున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సమాధానం దాటవేశారు. ఎన్నికలకు సమష్టిగా పోటీ చేసి రాష్ట్రంలో పార్టీకి విజయం అందించాలని నాయకులంతా నిర్ణయించారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే గడువు ఉన్నందున ఇది అత్యంత ముఖ్యమై సమావేశంగా కమల్‌నాథ్ పేర్కొన్నారు.

ఎన్నికల వ్యూహాలపై చర్చించామని వివరించారు. కర్ణాటక మాదిరిగా ఈ రాష్ట్రంలో ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారా అన్న ప్రశ్నకు ‘నారీ సమ్మాన్ యోజన” అంశంపై ఈ సమావేశం ప్రారంభమైందని కమల్‌నాథ్ చెప్పారు. తాము కొన్ని చేశామని, భవిష్యత్తులో మరికొన్ని ప్రకటిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News