Monday, December 2, 2024

పార్లమెంటుల్లో రాజ్యాంగ వజ్రోత్సవాలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్లమెంట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా ప్రారంభించారు.  రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ్టి నుంచి ఏడాది పొడవునా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపనున్నారు. దేశంలోని స్కూళ్లల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పాఠ్యాంశాలను చేర్చనున్నారు. జాతినుద్దేశించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి దన్కడ్, స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని, లోక్ సభ, రాజ్య సభ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News