Monday, January 30, 2023

నత్తనడకన సాగుతున్న పల్లె దవాఖానాల నిర్మాణం

- Advertisement -

నాంపల్లి : బిల్లులు అందకపోవడం తో ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం నత్తనడకగా సాగుతున్నాయి. మండలంలోని నర్సింహులుగూడెం,పెద్దాపురం,పసునూరు,మేళ్లవాయి ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాల్లో ఒక్కో భవనానికి కేవలం 12 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించడంతో నిధులు సరిపోక నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయి. 20లక్షల రూపాయల వరకు నిధులు కేటాయిస్తే పల్లె దావఖానాల భవనాలు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. మండలం లోని మేళ్లవాయి గ్రామంలో భవన నిర్మాణ పనులు పూర్తికాగా నరసింహులగూడెం లోని భవనానికి బిల్లులు చెల్లించకపోవడం తో రంగులు వేసే పనులు నిలిచిపోయాయి. పెద్దాపురం గ్రామ పంచాయతీ పల్లె దావఖానకు 13 మాసాల క్రితమే శిలాపలకం వేసి పనులు ప్రారంభించినా నేటికీ భవనం పూర్తి కాలేదు.

ఇక పసునూరు గ్రామపంచాయితీ దవఖాన భవనం బిల్లులు లేక అర్ధాంతరంగా ఆగిపోయింది. ముష్టిపల్లి పల్లెదవఖాన పనులు నత్తనడకన సాగుతున్నాయి. 13 నెలల క్రితం నాటి మాజీ ఎంఎల్ఎ కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ భవనానికి శంఖుస్థాపన చేశారు. మూడు నెలల్లో దవఖాన భవనాలు అందుబాటులోకి వస్ధాయని శంఖుస్థాపన సమయంలో వైద్యాఆరోగ్యశాఖ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించడం విశేషం. కాగా నిర్మాణ పనులు పూర్తయిన భవనాలకు సగం బిల్లులే ఇవ్వడం తో ఇప్పటికే టెండర్లు పాడిన కాంట్రాక్టర్లు లాభాలు రావని గ్రహించి పనులను ఇతరులకు అప్పగిస్తున్నారు. అట్టి పనులు తీసుకున్న వ్యక్తులు వడ్డీలకు అప్పులు తెచ్చి పనులు చేపడితే బిల్లులు రావడంలేదని కాంట్రాక్టరులు వచ్చిన బిల్లులలో కమీషన్‌లు దొబ్బుతున్నారనే ఆరోపనలు వస్తున్నాయి.

దీంతో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్‌లు ఇబ్బందుల పాలౌవుతున్నారు. వైద్యారోగ్యశాఖ ఇంజనీరింగ్ అధికారులు పల్లెదవాఖానాల భవన నిర్మాణాలను సత్వరం పూర్తిచేసి ,సకాలంలో కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించి, అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles