Tuesday, October 15, 2024

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ అదుపుతప్పి కారు, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి కారణమైన కంటైనర్‌.. టమాటా లోడుతో చెన్నైకి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News