Friday, June 9, 2023

రైలు కింద పడి కాంట్రాక్టు కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

కాసిపేటః కాసిపేట గ్రామానికి చెందిన ఏల్పుల రాజేశం(40) అనే ఓసిసి కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం సోమగూడెం దుకాణాల సమూదాయం వెనక గల రైలు పట్టాల పక్కన రాజేశం పడి ఉండడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందజేసారు. కాసిపేట గ్రామానికి చెందిన రాజేశం ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజులుగా భార్య భర్తల మద్య గొడవలు జరుగుతున్నట్లు ఇరుగు, పొరుగు వారు తెలిపారు.

రాజేశం ఆదివారం రెండు గంటల విధులకు అని చెప్పి ఇంట్లో నుండి వెళ్లినట్లు కుటింబికులు తెలిపారు. ఇంటి నుండి వెళ్లిన రాజేశం ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రైలు క్రింద పడి ఆత్యహత్య చేసుకొని ఉంటాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్‌గౌడ్ తెలిపారు. రాజేశం రైలు క్రింద పడెందుకు వెళ్లిన సమయంలో రైలు తలకు తగలడంతో ప్రక్కకు పడి పోవడంతో తీవ్ర రక్తస్రవం అయి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News