Sunday, June 16, 2024

ఎమర్జెన్సీ వార్డు లోకి పోలీస్ వాహనం

- Advertisement -
- Advertisement -

వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ వాహనం ఏకంగా ఆస్పత్రి లోని ఎమర్జెన్సీ వార్డుకు దూసుకొచ్చింది. ఎయిమ్స్ రిషికేశ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. సర్జరీ యూనిట్‌లో విధుల్లో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించారంటూ రెండు రోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించారు. అతడు తనకు అసభ్యకర సందేశాలు పంపినట్టు ఆమె పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇతర వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తొలగించాలంటూ నిరసన చేపట్టారు. ఈ నేపథ్యం లోనే నర్సింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీస్‌లు రాగా,

బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూసి తమ వాహనంతో నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లిపోయారు. అనంతరం అతడిని అదుపు లోకి తీసుకున్నారు. పోలీస్ వాహనం లోపలికి వెళ్తున్న వీడియోలో బెడ్లపై పేషెంట్లు కనిపించారు. ఎస్‌యూఏ వస్తుండగా, కొందరు భద్రతా సిబ్బంది అది వెళ్లడానికి దారిని సిద్ధం చేశారు. అలాగే నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్‌లు అక్కడి వైద్యులను అదుపు చేయడం ఆ దృశ్యాల్లో కనిపించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ శిక్ష సరిపోదని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News