Wednesday, April 24, 2024

7.9 శాతానికి దిగివచ్చిన కరోనా పాజిటివిటీ రేటు

- Advertisement -
- Advertisement -

Corona positivity rate dropped to 7.9 percent

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి అదుపు లోకి వస్తోంది. కొత్త కేసులు , పాజిటివిటీ రేటు తగ్గుతుండడం, ఊరట కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 16.03 లక్షల మంది కరోనా పరీక్షలు చేయించుకోగా, 1,27,952 మందికి వైరస్ నిర్ధారణ అయింది. క్రితం రోజు నమోదైన కేసులతో పోలిస్తే ఈ సంఖ్య 14 శాతం తక్కువ. ఇక పాజిటివిటీ రేటు కూడా 9.2 శాతం నుంచి 7.9 శాతానికి దిగొచ్చింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దిగివస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 13.31 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4. 02 కోట్ల మంది కరోనాను జయించగా, రివకరీ రేటు 95.64 శాతానికి చేరింది.

ఇక మరణాల సంఖ్య మాత్రం ఎక్కువ గానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా కొన్ని రాష్ట్రాలు మరణాల నమోదును సవరిస్తుండటంతో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తాజాగా 1059 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఒక్క కేరళ లోనే 595 మరణాలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా సవరించిన మరణాలే కావడం గమనార్హం. కరోనా దేశం లోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 5,01, 114 మందిని బలిగొంది. టీకా డ్రైవ్‌లో శుక్రవారం దేశ వ్యాప్తంగా 47,53,081 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 168.98 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News