Thursday, October 10, 2024

పోలీసులు అదుపులో ముద్దులతో న్యూసెన్స్ చేసిన జంట

- Advertisement -
- Advertisement -

నడి రోడ్డుమీద బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ న్యూసెన్స్ చేసిన జంటను బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి నోటీసులు జారీ చేశారు. బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ తోట భూపతి వెల్లడించిన వివరాల ప్రకారం కోల్‌కతాకు చెందిన మొహమ్మద్ వాసిఫ్ ఆర్షద్ గచ్చిబౌలిలోని భాను పీజీ హాస్టల్ లో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణ శర్మ హైటెక్ సిటీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని సిటీ ప్రశాంతి ఉమెన్ పీజీ హాస్టల్‌లో ఉంటుంది. మొహమ్మద్ వాసిఫ్ ఆర్షద్, అన్నపూర్ణ శర్మలు స్నేహితులు.

ఈనెల 22వ తేదీన మొహమ్మద్ వాసిఫ్ ఆర్షద్ బైక్ పై అన్నపూర్ణ శర్మ తో కలిసి ఆదిభట్లలోని స్నేహితులను కలవడానికి వెళ్లారు. అయితే పహాడి షరీఫ్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై రివర్స్‌లో కూర్చొని ముద్దులు పెడుతూ నడి రోడ్డుపై న్యూసెన్స్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో బాలాపూర్ పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించగా బైక్ నెంబర్ ను పసిగట్టారు. దీంతో సాంకేతిక ఆధారంగా రోడ్డు పై న్యూసెన్స్ చేసిన స్నేహతులను పోలీసులు అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News