Friday, May 2, 2025

రూ.9కోట్లు దోచుకున్న కిలాడి దంపతులు

- Advertisement -
- Advertisement -

పాల వ్యాపారంలో పెట్టుబడిపెడితే నెల నెలా భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాలు తీసుకుని మోసం చేసిన దంపతులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం ,కోకాపేటకు చెందిన వేముల సబ్బారావు, వేముల కుమారి కొండపల్లి డైరీ ఫామ్‌ను మోయినాబాద్ మండలం, నాగిరెడ్డిగూడలో నిర్వహిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన దంపతులు జూన్,2022లో న్యూస్ పేపర్లలో బ్యూజినెస్ ఆఫర్ పేరుతో ప్రకటన ఇచ్చారు. తాము 16 ఏళ్ల నుంచి పాల వ్యాపారం చేస్తున్నామని, ఇందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని పేర్కొన్నారు.

ఇది చూసిన బాధితులు చాలామంది నిందితులను సంప్రదించారు. వారిని డైరీ ఫాం వద్దకు తీసుకుని వెళ్లిన నిందితులు ఫాంలో పెట్టుబడిపెడితే నెలకు రూ.2 నుంచి 5లక్షలు లాభాలు వస్తాయని చెప్పారు. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తే భారీగా లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పడంతో వీరి మాటలు నమ్మిన 41మంది బాధితులు రూ.9కోట్లు పెట్టుబడిపెట్టారు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు తిరిగి ఇవ్వడం మానివేశారు. బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News