Friday, March 1, 2024

గోడ కూలి దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వర్షాలకు ఇంటి గోడ నాని కూలిపోవటం తో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మా దారం గ్రామానికి చెందిన పుల్లారావు, లక్ష్మిలు కూలీలు పనులు చేసుకుంటూ జీవనం  సాగిస్తున్నారు. మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పుల్లారావు ఇంటి గోడ నాని మంగళవారం అర్థరాత్రి సమయంలో కూలిపోయి ఇంట్లో నిద్రిస్తున్న నూకతొట్టి పుల్లారావు(40), లక్ష్మీ(30)లపై గోడ పెచ్చులు పడిపోయాయి.

దీంతో గోడ శిథిలాల కింద భార్యాభర్తలు చిక్కుకున్నారు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే పుల్లారావు, లక్ష్మిలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి బుధవారం వారి మృతదేహాలను సందర్శించి నివాళి అర్పించారు. తక్షణ సహాయంగా రూ.లక్ష నగదును అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News