Thursday, May 2, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసుకు… ప్రత్యేక పిపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రణీత రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు.

పారదర్శకంగా విచారణ : సిపి శ్రీనివాస్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారిగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. కేసుతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News