Monday, September 1, 2025

వర్షం మిగిల్చిన విధ్వంసం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లాలో 77వేల ఎకరాల్లో పంటలకు నష్టం

కోట్లాది రూపాయల నష్టం 
వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు..మట్టి దిబ్బలు 
100 గ్రామాలకు ఐదురోజులుగా ఆర్‌టిసి సేవలు నిలిపివేత
కొట్టుకుపోయిన వంతెనలు, రహదారులు 
50కి పైగా పాక్షికంగా, పూర్తిగా కూలిపోయిన ఇళ్లు

మనతెలంగాణ/ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మూడు రోజులపాటు కురిసిన కుంభవృష్టి విధ్వంసం సృష్టించింది. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షం రైతుల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రకృతి చేసిన విలయతాండవానికి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద చెరువులు, కుంటలు చిగురుటాకుల వణికిపోయాయి. ఈ వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి వర్షం కోసం మొక్కిన రైతుల కోరికలు తీ ర్చాలనుకున్న వరణుడు కుంభవృష్టి కురిపించా డు. జిల్లాలో 76,984 వేల ఎకరాల్లో పండుతున్న పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులకు అం దిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జిల్లాలో 30కిపైగా చెరువులు కొట్టుకుపోయాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సిన చెరువులు, కుం టలు ఖాళీ అయిపోయాయి. రహదారులు కొట్టుకుపోయి ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. దా దాపు 100 గ్రామాలకు ఐదు రోజులుగా ఆర్‌టిసి సేవలు అందడం లేదు. పలుచోట్ల 30 గంటల పా టు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

60 గంటల పాటు కురిసిన 64 సెంటీమీటర్ల వర్షపాతం రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలాల్లో 30,450 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ఎ ల్లారెడ్డి ఎడిఎ సుధా మాధురి తెలిపారు. గాంధారి, లిం గంపేట, నాగిరెడ్డిపేట, రామారెడ్డి, సదాశివ నగర్, తా డ్వాయి, ఎల్లారెడ్డి మండలాల్లో 18,433 ఎకరాల్లో వరిపంటలు నీట మునిగాయని అన్నారు. 6,541 ఎకరాల్లో మక్క పంట నష్టపోయిందని అన్నారు. 3,791 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిలిందని అన్నారు. 1,685 ఎకరాల్లో సోయాబీన్ పంటకు వర్షానికి నష్టం కలిగిందని అ న్నారు. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు కొట్టకుపోవడం వల్ల చెరువుల నుంచి వచ్చే రాళ్లు, రప్పలు, మొరం, ఇసుక పంట పొలాల్లో మేటలు వేసింది. వీటిని తొలగించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అని రైతులు వాపోతున్నారు.

ఒకవైపు కొట్టుకుపోయిన పంటలతో కన్నీరు కారుస్తున్న రైతన్నలకు గోరుచుట్టుపై రోకలిపోటులా ఇసుక మేటలు మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కో ట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న పం టలు పొట్టదశలో ఉండగా నీట మునగడం , కొట్టుకుపోవడం వంటి పరిణామాలతో రైతులు కన్నీరు కారుస్తున్నా రు. నియోజకవర్గంలోని రైతులకు ఇది కోలుకోలేని దెబ్బ అని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో దా దాపు పదికి పైగా చెరువుల కట్టలు తెగిపోవడంతో రైతు లు నష్టాల పాలయ్యారు. ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్, లక్ష్మాపూర్ చెరువులు తెగిపోవడంతో పాటు తాటివాని మత్తడి కట్ట కూతకు గురైంది మొత్తం నీరు ఖాళీ అయింది. నాగిరెడ్డిపేట మండలంలో నాగిరెడ్డిపేట పటేల్ చెరువు, అక్కంపల్లి రెడ్డి కుంట తెగిపోయింది. రాజంపేట మండలంలో రాజంపేట దేవుని చెరువు, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్, గుండారం చిన్నచెరువు, మొండివాగు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి. తాడ్వాయి మండలంలోని దేమే పెద్ద చెరువు, లింగంపేట్ మండలంలో మల్లాపూర్ చెరువు, కన్నపూర్ చౌదరి చెరువు కట్టలు తెగిపోయాయి. పలు చెరువుల మట్టి కట్టలు తెగిపోయాయి. భారీ వర్షాలకు రాజంపేట మండలం,ఎల్లాపూర్, నడిపి, బెస్త మామిడి, షేర్‌శంకర్, గుడి, ఇనం తండాలు దాదాపు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

కోతకు గురైన రహదారులు
నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు వెళ్లే రహదారులు భారీ వర్షానికి కోత గురికావడం, కొట్టుకుపోవడంతో కొ న్ని గ్రామాలకు నాలుగు రోజుల పాటు రాకపోకలు స్తం భించాయి. ఎల్లారెడ్డి మండలంలో తిమ్మారెడ్డి, రుద్రారం, మల్కాపూర్ మతమాల, అల్మాజిపూర్, జంగమయ్యపల్లి, బ్రాహ్మణపల్లి, అడవి లింగాల, వెల్లుట్ల, వెల్లుట్ల పేట, అ న్నా సాగర్ గ్రామాలకు మూడు రోజులపాటు రాకపోక ల బంద్ అయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వె ళ్లే దారిలో, జిల్లా కేంద్రానికి వెళ్లే దారుల్లో ప్రధాన రహదారులు కోతగురి కావడంతో ఐదు రోజులుగా రెండు పట్టణాలకు ఎల్లారెడ్డి నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. రాజంపేట మండలంలో కొండాపూర్=గుండారం రహదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. సదాశివనగర్ మండలంలో పద్మావతి వాడి, కలవరాలు, తిరుమల్ పల్లి , రామారెడ్డి, అమరబండ, ధర్మారావుపేట వెళ్లే రహదారులు కోతకు గురయ్యాయి. నాగిరెడ్డిపేట మండలంలో హైదరాబాద్ వెళ్లే రహదారులు రెండు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. లింగంపేట మండలంలో లింగంపల్లి బ్రిడ్జి, కొర్కోల్ బ్రిడ్జి, కన్నాపూర్, పోల్కంపేట్, నాగారం రహదారులు కొట్టుకుపోయాయి.

వర్షానికి కూలిపోయిన ఇళ్లు
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో వర్షానికి ప లువురి ఇళ్ల్లు కూలిపోగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నా యి. గాంధారి మండలంలో ఆరు గృహాలు పూర్తిగా కూలిపోయాయి. సదాశివనగర్ మండలంలో ఏడు ఇండ్లు కూ లిపోయాయి. ఎల్లారెడ్డి మండలంలో పది ఇళ్ల్లు కూలిపోయాయి. తాడ్వాయి మండలంలో రెండు, నాగిరెడ్డిపేట్ మండలంలో 8, రామారెడ్డి మండలంలో 10, లింగంపే ట మండలంలో 10 ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం. ఇల్లు కూలిపోయిన పలువురు నిరాశ్రయులయ్యారు. ప్ర భుత్వమే ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షం వల్ల తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. రెండు పౌల్ట్రీ ఫారా లు కొట్టుకుపోవడంతో ఆ యజమానులకు దాదాపు రూ.40 లక్షల నష్టం వాటినట్లు పౌల్ట్రీ ఫాంల యజమానులు పేర్కొంటున్నారు.

కొట్టుకుపోయిన ‘కళ్యాణి’ మట్టి గట్లు
పోచారం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు పోటెత్తిం ది. నూట మూడు సంవత్సరాల ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రాజెక్టు పైనుంచి 1,81 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి 70 వేల క్యూసెక్కుల నీటిని తట్టుకునే సామర్థ్యం మాత్రమే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు 100 సంవత్సరాలు దాటిన సామ ర్థ్యం కంటే రెండున్నర ఇంతలు నీరు వెళ్లిన తట్టుకొని నిలబడగలిగింది. ప్రాజెక్టు కట్ట వద్ద మట్టి కోతకు గురై గుంత ఏర్పడగా అధికారులు, పజలు ఆందోళన చెందారు. కానీ భారీ వర్షానికి సైతం ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. ఎ ల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు గేట్ల సామర్థ్యం 19 క్యూసెక్కులుగా అధికారులు పేర్కొనగా, 30 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చిందని పేర్కొంటుండగా, ప్రా జెక్టుకు ఇరువైపులా మట్టి అడ్డుకట్ట కొట్టుకుపోయింది.

వందకు పైగా గ్రామాలకు లేని ఆర్‌టిసి సేవలు
నియోజకవర్గంలోని వందకు పైగా గ్రామాలకు ఆర్‌టిసి బస్సుల సేవలు అందడం లేదు. ఎల్లారెడ్డి, కామారెడ్డి రహదారి పలుచోట్ల కోత గురికావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎల్లారెడ్డి, హైదరాబాద్ రహదారి కోతకు గురైంది. ఈ రహదారుల్లో ఉన్న 100కు పైగా గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ రహదారిలో సైతం పలుచోట్ల రహదారి కోత గురికావడంతో కొన్ని బస్సులను పిట్లం మీదుగా నడిపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా బస్సులు రాకపోవడంతో ప్రజాజీవనం చాలాచోట్ల స్తంభించింది. దాదాపు నియోజకవర్గంలో 30 గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడినా సిబ్బంది అహర్నిశలు కష్టపడి పునరుద్ధరించారు. ఏదేమైనా నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షంతో రైతులు ప్రజలు చాలా నష్టాలకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News