Saturday, April 27, 2024

కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్లారు

- Advertisement -
- Advertisement -

లక్నో : రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ వోట్లు వేసిన తమ పార్టీ ఎంఎల్‌ఎలలో కొందరు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఫిరాయించారని, మరి కొందరు ఒత్తిడికి లోనయ్యారని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బుధవారం తెలియజేశారు. క్రాస్ వోటు వేసినవారిపై ‘నిర్ధారిత నిబంధనల’ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలలో దాదాపు ఏడుగురు ఎస్‌పి ఎంఎల్‌ఎలు బిజెపికి అనుకూలంగా క్రాస్ వోటు వేయడం గురించి విలేకరులు అడిగినప్పుడు ‘ప్రభుత్వం నుంచి ఎంతటి ఒత్తిడి వచ్చిందో ఊహించంది. ఎస్‌టిఎఫ్ ప్రభుత్వ స ంస్థ. కొందరు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి (బిజెపి వైపు) వెళ్లారు. కొందరు ఒత్తిడికి గురయ్యారు. కొందరు గౌరవం కోసం వెళ్లారు. వారికి త్వరలో గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అఖిలేశ్ సమాధానం ఇచ్చారు.

రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ వోటు వేసిన ఎస్‌పి ఎంఎల్‌ఎలపై ఏ చర్య అయినా తీసుకుంటారా అన్న ప్రశ్నకు పార్టీ అధ్యక్షుడు సమాధానం ఇస్తూ, ‘అమలులో ఉన్న నిబంధనల ప్రకారం చర్య తీసుకోగలం’ అని చెప్పారు. ‘వారు ఇప్పుడు ఏవిధంగా వోటర్లను ఎదుర్కోగలరు అనేదే పెద్ద సమస్య. వారు బిజెపిపై పోరాడి గెలిచారు. ఇప్పుడు ఆ వోటర్లకు వారి అంతరాత్మ ఏమి చెబుతుంది? వారికి ఏ సమాధానం ఇస్తారు’ అని అఖిలేశ్ అన్నారు. ‘బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఎటువంటివో వారు మాతో చెబుతుండేవారని మాకు గుర్తు. ఇప్పుడు ఆ సమాచారం మాకు ఎవరు ఇస్తారని ఆందోళన చెందుతున్నాం’ అని అఖిలేశ్ వ్యంగ్య ధోరణిలో అన్నారు. క్రాస్ వోటింగ్ గురించి పార్టీ నాయకత్వానికి తెలుసా అన్న ప్రశ్నకు అఖిలేశ్ సమాధానం ఇస్తూ, ‘వెళ్లిపోవాలని కోరుకున్న వారిని ఎవరూ ఆపజాలరు. మీరు నన్ను ఈ ప్రశ్న అడగరాదు. మర్యాద పురుషోత్తమ్ రామ్ జీ గురించి మాట్లాడే బిజెపిని అడగాలి. వారి ‘మర్యాద’ ఎక్కడ?’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News