Tuesday, November 28, 2023

నక్సల్స్ కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్ అధికారి మృతి

- Advertisement -
- Advertisement -

CRPF officer killed in Naxal Encounter

 

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులలో సిఆర్‌పిఎఫ్ అధికారి ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బసగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్, పుత్కేల్ మధ్య ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రారంభానికి సంబంధించి పెట్రోలింగ్ డ్యూటీపై వెళ్లిన 168వ బెటాలియన్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులలో గాయపడిన అసిస్టెంట్ కమాండెంట్ ఎస్‌బి టిర్కీ మరణించినట్లు వారు చెప్పారు. మావోయిస్టుల కాల్పులలో మరో సిఆర్‌పిఎఫ్ జవాను కూడా గాయపడినట్లు వారు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News