Monday, July 15, 2024

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సిఎస్ శాంతి కుమారి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం ఎదురుగాఉన్న తెలంగాణా అమరుల స్మారక కేంద్రం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలతో కలసి బతుకమ్మ పండగలో పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవిలు కూడా ఈ బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు.

ముందుగా బతుకమ్మలను పూజలు నిర్వహించిన అనంతరం ఈ సద్దుల బతుకమ్మకు ఊరేంగింపుగా పెద్ద ఎత్తున వచ్చిన మహిళలతో కలసి సిఎస్. శాంతి కుమారి, కార్యదర్శులు శైలజ రామయ్యర్, శ్రీదేవిలు బతుకమ్మ ఆడారు. కాగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జిహెచ్‌ఎంసిలు ఉమ్మడిగా ఈ బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాయి.

Shanti-Kumari-Saddula

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News