- Advertisement -
బెంగళూరు: ఐపిఎల్ లో భాగంగా శనివారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో చెన్నైసూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ గెలుపుతో బెంగళూరు ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. 8వ విజయంతో ఛాలెంజర్స్ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఓపెనర్లు జాకబ్ బెతెల్ (55), విరాట్ కోహ్లి (62) జట్టుకు శుభారంభం అందించారు. ఇక చివర్లో రొమారియో షెఫర్డ్ 14 బంతుల్లోనే ఆరు సిక్స్‌లు, 4 ఫోర్లతో అజేయంగా 53 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసి కొద్ది తేడాతో ఓటమి పాలైంది. యువ సంచలనం అయుష్ మాత్రె 48 బంతుల్లోనే 9 ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 94 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -