Saturday, July 27, 2024

మిల్లర్ల మోనార్క్ ఆడిందే ఆట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉండడంతోనే మిల్లర్ల అసోసియేషన్ ముసుగులోని మో నార్క్ ఇంత కాలం ‘ఆడిందే ఆట, పాడిందే పాట’ గా మారింది. పకడ్బందీ విధానం లేకపోవడంతోనే మిల్లర్ల డాన్ అండదండలతో కస్టమ్ మిల్లింగ్ రైసు ను కొందరు అక్రమ మిల్లర్లు యధేచ్ఛగా ఎగవేస్తున్నారు. రాష్ట్రంలో 2010-11 నుంచి 2021-22 దాకా పదేళ్ళల్లో 43 మంది మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలారు. వీరు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వని సరకు విలువ రూ. 663 కోట్ల దా కా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. పౌర సరఫరాల శాఖలో గడిచిన కొంత కాలంగా మారిన అధికారులు 43 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు, ఆర్‌ఆర్ యాక్ట్ అమలుకు ఆదేశాలు ఇచ్చినా అవి జిల్లా స్థాయిలో కూడా నూటికి నూరు శాతం అమలు కావడం లేదు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 16 మంది దాకా మిల్లర్లు ప్రభుత్వానికి ఇప్పటి దాకా బియ్యం బకాయిలు వేల కో ట్ల రూపాయలకు చేరుకుందంటే ఇక్కడ అక్రమ మిల్లర్ల బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చే సుకోవచ్చు.

సూర్యాపేట జిల్లాతో పాటు మరి కొన్ని జిల్లాల్లో రాజకీయ నేతల ఆశీస్సులతో ఎగవేతలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఎగవేతల వెనుక డైరెక్షన్ అంతా అసోసియేషన్ మోనార్క్ కమ్ డాన్‌దేనని మిల్లింగ్ సక్రమంగా చేసే వ్యాపారులు చెబుతున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బ్యాం కు గ్యారంటీలతో కస్టమ్ మిల్లింగ్ రైసు 100% ప్ర భుత్వానికి చేరుతుండగా ఇక్కడ మాత్రం ఎలాంటి గ్యారెంటీలు లేకపోవడంతోనే సర్కారీ ధాన్యం వేల కోట్ల రూపాయలు మేరకు బహిరంగ మార్కెట్‌కు చేరుకుంటున్నది. సిఎంఆర్ ధాన్యం తీసుకునే మి ల్లర్ బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఒకవేళ బియ్యం ఇ వ్వకపోతే ఆ గ్యారంటీని ప్రభుత్వం స్వాధీనం చే సుకుంటుందని భయంతో ప్రభుత్వ ధాన్యాన్ని గ డువులోగా బియ్యంగా మార్చి అప్పచెప్పే అవకా శం ఉన్నది. కానీ, ఇక్కడ బ్యాంకు గ్యారంటీల భ యం లేకపోవడంతో సిఎంఆర్ ధాన్యంతో అక్రమ మిల్లర్లు రూ. వేల కోట్లు దోచుకుంటున్నారు. ప్రస్తు తం ఇక్కడ అమలులో ఉన్న విధానం ప్రకారం ఒక మిల్లర్‌కు ప్రభుత్వం సిఎంఆర్ ధాన్యం ఇస్తే అక్కడే ఉన్న మరో మిల్లర్ గ్యారెంటీ ఇవ్వాలి. దానికి అనుబంధంగా స్థానిక అసోసియేషన్లు కూడా గ్యారెంటీ ఇవ్వాలి.

కానీ గ్యారెంటీలు ఇచ్చే వాళ్లంతా స్థానికులే కావడంతో వారంతా కుమ్మక్కయి సిఎంఆర్ బియ్యాన్ని తిలాపాపం తలా పిడికెడులా మింగేస్తున్నారు. ఇక్కడ మిల్లర్లలో మోనార్క్‌గా వ్యవహరిస్తున్న అసోసియేషన్ పెద్ద చాలా మిల్లులకు గ్యారెంటీ ఇచ్చి సిఎంఆర్ కేటాయింపులు చేయించారని విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పౌర సరఫరాల అధికారులు, జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, డిఎస్‌ఒలు మామూళ్ళతో గుడ్డిగా సిఎంఆర్ కేటాయింపులు చేయడంతో పాటు ఆ ధాన్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించకుండా భారీగా ఖజానాకు చిల్లులు పెట్టినా మౌనంగా ఉండిపోయారు. కొన్ని జిల్లాల్లో ఎంఎల్‌ఎలు కూడా ఈ బియ్యం ఎగవేత దందాను ప్రోత్సహించారని ఇది గత ప్రభుత్వ హయాంలో అసాధారణ స్థాయికి చేరిందని మిల్లర్ల వర్గాలు చెబుతున్నాయి. ధాన్యం సేకరణ బియ్యం అప్పగింతలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్యాంకు గ్యారంటీలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచినా ఆ విధానాన్ని ఇక్కడ అమలు కాకుండా చేయడంలో గత ప్రభుత్వంది కూడా కీలక పాత్రేనని ఆ వర్గాలు చెబుతున్నాయి.

పాలసీని శాసించారు, మిల్లర్లను వేధించారు
పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, అధికారులు ఎవరైనా వారిని లంచాలతో బుట్టలో వేసుకోవడంలో మోనార్క్‌కు ఎదురు లేదు. వారందరినీ గుప్పిట పట్టుకొని ఆ మోనార్క్ సిఎంఆర్ విధానాన్ని శాసించారని, సక్రమ మిల్లర్లను కూడా లంచాల కోసం వేధించారని మిల్లర్ల వర్గాల నుంచి విమర్శలు ఉన్నాయి. సిఎంఆర్ బియ్యాన్ని ఎగవేసిన వారికి పదే పదే కేటాయింపులు ఎందుకు చేస్తున్నారని సక్రమ మిల్లర్లు ఎదురు తిరిగితే వారిపై విజిలెన్స్ అధికారులతో ఆ మోనార్క్ దాడులు చేయించే దాకా ఎదిగాడని ఆ వర్గాలు పేరు చెప్పకుండా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మిల్లర్లు దొంగలనే చెడ్డ పేరు రావడానికి కూడా ఈ మోనార్క్ కమ్ డాన్ కారణమని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలోని పెద్ద ఆశీస్సులతో ఈ డాన్ చెలరేగి మిల్లింగ్ సేకరణ విధానాన్ని భ్రష్టు పట్టించాడని వారు చెబుతున్నారు.

రూ. 663 కోట్లు బకాయిలు ఉన్న వారిలో టాపర్లు
సూర్యాపేటలోని శ్రీ ఉషశ్విని, లక్ష్మీసహస్ర పేరిట నాలుగు మిల్లులు, గద్వాలలో లక్ష్మీ నరసింహస్వామి ట్రేడర్స్, నిర్మల్‌లో రాజరాజేశ్వరా రైస్ మిల్, హనుమకొండలో బాలాజీ స్టేక్ రైస్ ఇండస్ట్రీ, నిజామాబాద్‌లో ఎఫ్‌టిఎఫ్ ఆగ్రో ఇండస్ట్రీస్, హనుమకొండలో వసుధా లక్ష్మీ, నిజామాబాద్‌లో వెంకట లక్ష్మీ, నాగర్ కర్నూల్‌లో పద్మావతి, హనుమకొండలో కార్తికేయ ఆగ్రో, ములుగులో సాయి సహస్ర, వరంగల్‌లో ఎంఎస్‌ఆర్ రైస్, నిజామాబాద్‌లో శేషాద్రి ఆగ్రో, సిద్దిపేటలో ఎఆర్‌ఎం రైస్, నిర్మల్‌లో శ్రీ సాయి శ్రీనివాస, వరంగల్‌లో అశోక ఇండస్ట్రీస్, నల్లగొండలో సరస్వతీ ఇండస్ట్రీస్‌లు మొత్తం 43 డిఫాల్టు మిల్లుల్లో అగ్రగామిగా నిలిచాయి. ఇప్పటి వరకు ఈ బకాయిల సంగతి తేలలేదు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు. కాని ఇవన్నీ వ్యాపారాలు చేయడమే విశేషం.

బ్యాంకు గ్యారంటీలు, మిల్లుల స్వాధీనాలు, వ్యక్తిగత ఆస్తుల జప్తుతోనే అక్రమాలకు అడ్డుకట్ట
ప్రస్తుత కొత్త ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళించాలి. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారికే సిఎంఆర్ కేటాయింపులు చేయడంతో పాటుగా డిఫాల్టర్లపై ఉక్కు పాదం మోపాలి. రికార్డుల్లో డిఫాల్టర్లుగా ఉన్న మిల్లులను స్వాధీనం చేసుకుని యజమానులపై పిడి యాక్ట్ కింద కేసులు, చివరకు దారికి రాకపోతే వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటే తప్ప అక్రమ బియ్యం దందా అడ్డుకట్ట పడదని మిల్లింగ్ పరిశ్రమలోని సక్రమ మిల్లర్లు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News