Friday, April 19, 2024

ఫామ్‌హౌస్‌లపై మెరుపు దాడులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫాంహౌస్‌లపై పోలీసులు సోమవారం మెరుపు దాడులు నిర్వ హించారు. పలు ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో పలువురు నిందితులను అదుపులోకి తీ సుకున్నారు. మొయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫాంహౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ పరిధిలోని రిఫ్లైజ్ ఫాంహౌస్, మేడ్చల్ లోని గోవర్ధన్ రెడ్డి ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.ఫాంహౌస్‌ల నుంచి మద్యం సీసాలు, హుక్కా సామగ్రి, ప్లేయింగ్ కారడ్స్, లక్ష రూపాయల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 32 ఫాంహౌస్‌లలో తనిఖీలు చేపట్టిన పోలీసులు నాలుగు ఫౌంహౌ స్‌లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. 24మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మెయినాబాద్ పిఎస్ పరిధిలోని బిగ్‌బాస్ ఫాంహౌస్‌లో అబ్దుల్ మజీద్, బి.స్వామిలు ఉన్నారు.

కాగా సదరు ఫామ్ హౌస్ యజమాని ముతవలీ సాహెబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జహంగీర్ డ్రీమ్ వ్యాలీ ఫాంహౌస్‌లో షేక్ సౌఫియాన్, హైక్ ఇస్మాయిల్, మొహ్మద్ నవాజ్, మొహ్మద్ అఫ్రోజ్, సయ్యద్ సిద్ధిక్, సయ్యద్ రఫీ, మొహ్మద్ ఇజాజ్, మొహమ్మద్ నదీమ్, మొహ్మద్ ఫిరోజ్‌ఖాన్, మొహ్మద్ ముస్తఫాలను అదుపులోకి తీసుకోగా, ఫాంహస్ యజమాని అజహర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక శంషాబాద్ పిఎస్ పరిధిలో రిప్లైజ్ ఫాంహస్‌లో నిఖిల్, మొహ్మద్ ఇంతియాజ్, రాజులను అదుపులోకి తీసుకోగా సదరు ఫాంహౌస్ యజమాని హేమంత పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.మేడ్చల్ పిఎస్ పరిధిలో గోవర్థన్‌రెడ్డి ఫాంహస్‌లో కె.గోవర్ధన్‌రెడ్డి, పి.రాజేష్, ఎం.మాధవరెడ్డి, టి.శ్రీనివాస్, ఎస్.రవి, ఆర్.ప్రకాష్, సైలూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఫాంహస్‌లో బెట్టింగ్‌తో పేకాట నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడులు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మూడు ఫాంహస్‌లలో అనధికార లిక్కర్, హుక్కా సేవనంతో పాటు పలు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే, గతంలో కూడా ఫాంహౌస్‌లపై పోలీసులు దాడులు చేశారు.నగరానికి దూరంగా ఉండటంతో ఫాంహౌస్‌లలోనే ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తుం డటంతో పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆయా ఫాంహస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు శృతిమించడాన్ని పోలీసులు గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అనైతిక చర్యలను ఉపేక్షించేది లేదని సైబరా బాద్ ఎస్వోటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమాచారం ఏదై నా ఉంటే సదరు సమాచారాన్ని సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ : 9490617444 నెం బర్‌కు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News