Monday, June 17, 2024

దూసుకొస్తున్న రెమాల్ తుఫాను: బంగ్లాదేశ్ లో భారీగా జనాల తరలింపు

- Advertisement -
- Advertisement -

ఢాకా: దేశంలోని తీరప్రాంత జిల్లాలైన సత్ఖిరా , కాక్స్ బజార్‌లలో అధిక అలల ఉప్పెన , భారీ వర్షపాతంతో సాయంత్రం లేదా అర్ధరాత్రికి తీవ్ర తుఫాను ‘రెమాల్’ తాకనుందని అంచనా వేస్తున్నందున,  బంగ్లాదేశ్ ఆదివారం రిస్క్ ప్రాంతాల నుండి జనుల తరలింపు ప్రారంభించింది.

తాజా తుఫాను హెచ్చరిక బులెటిన్ ప్రకారం, ‘రెమాల్’ ఉత్తర దిశలో కదిలే అవకాశం ఉంది, సాయంత్రం లేదా అర్ధరాత్రికి మోంగ్లా సమీపంలోని పశ్చిమ బెంగాల్-ఖేపుపారా తీరంలోని సాగర్ ద్వీపం దాటవచ్చని బిఎస్ఎస్  వార్తా సంస్థ నివేదించింది.

“ఇప్పటికే పెద్ద ఎత్తున  తరలింపు ప్రారంభమైంది.  ముప్పు ఎదుర్కొంటున్న వారందరినీ సాధ్యమైనంత తక్కువ సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నాం ”అని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మిజానూర్ రెహమాన్ చెప్పినట్లు బిఎస్ఎస్  పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News