Tuesday, December 10, 2024

యుఎస్‌లో ‘డాకు మహారాజ్’ ఈవెంట్

- Advertisement -
- Advertisement -

హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్‌తో సినిమాపై భారీ లెవెల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక యుఎస్‌లోని డల్లాస్‌లో జనవరి 4న డాకు మహారాజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News