Sunday, July 6, 2025

దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు తనతో పాటు 140 కోట్ల భారతీయులు తోడుగా ఉన్నారన్నారు. ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు దలైలామా శాశ్వత చిహ్నమని ప్రశంసించారు. దలైలామా సందేశం అని మతాలను ప్రభావితం చేస్తుందన్నారు. ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

దలైలామాకు అమెరికా కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఐక్యత, శాంతి సందేశం ద్వారా దలైలామాకు ప్రజలను ప్రభావితం చేస్తున్నారని, టిబెటన్ల హక్కులు, స్వేచ్ఛను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. టిబెటన్ల భాష, సంస్కృతి, మత వారసత్వాన్ని కాపాడేందుకు మద్దతిస్తామని, టిబెటన్ల మత నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛకు మద్దతిస్తామని స్పష్టం చేసింది. భారతదేశంలోని ధర్మశాలలోని సుక్లాఖాంగ్ టిబెటన్ బౌద్ధ సముదాయంలో తన 90వ పుట్టినరోజు వేడుకలను దలైలామా ఘనంగా జరుపుకున్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News