Friday, January 27, 2023

ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే

- Advertisement -

దళిత బంధు పథకంలో భాగంగా నాచారంలో ఎబి గ్రాఫిక్స్ ఫ్లెక్స్ ప్రింటింగ్ సెంటర్‌ను ప్రారంభించిన కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నాచారంలో దళితబంధు లబ్ధిదారుడు వేముల మారయ్య ఏర్పాటు చేసిన ఎబి గ్రాఫిక్స్ ఫ్లెక్స్ ప్రింటింగ్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం సమయం నుండి కెసిఆర్ వెంట నడిచిన వ్యక్తి మారన్న అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి దళితబంధు రావడం… ఈ కార్యక్రమానికి హాజరవడం సంతోషంగా ఉందన్నారు.
దళిత వర్గాలపై సిఎం కెసిఆర్ అమితమైన ప్రేమ ఉందన్నారు.

దీని కారణంగానే దేశ పార్లమెంటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని కవిత పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు దళిత బంధు పథకం ద్వారా 563 మంది లబ్ది పొంది సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. త్వరలో గిరిజన బంధు అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ , డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్లు శాంతి సైజన్ శేఖర్ , బొంతు శ్రీదేవి , మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇన్‌ఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి , రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత

సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలనే సదుద్దేశంతో పని చేసే ప్రభుత్వం తెలంగాణ అని ఎంఎల్‌సి కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అడ్వకేట్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు.తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఖమ్మం కోర్టులో ప్రతి రోజు తెలంగాణ గీతాలాపన చేసి కోర్టులోకి పోయేవాళ్లని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ న్యాయపరమైన హక్కుల గురించి అర్థం కావాలన్న కవిత, న్యాయవాదుల డిమాండ్లను తప్పకుండా పరిశీలిస్తామన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles