Wednesday, December 6, 2023

ఒంగోలులో దారుణ ఘటన..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఒంగోలులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దొంగతనాలకు పాల్పడే మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నవీన్‌ను మద్యం తాగుదామని అంజి కిమ్స్ దవాఖానా వెనకాల వైపు తీసుకెళ్లి మద్యం తాగించాడు. తరువాత తన గ్యాగ్ తో కలిసి అంజి, నవీన్ మీద దాడి చేసి కొట్టారు.

అంతటితో ఆగకుండా నవీన్ నోట్లో మూత్రం పోసి తాగాలని దాడి చేస్తూ.. మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు, ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సుమోటగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News