Tuesday, December 10, 2024

అడిగిందానికే జవాబివ్వండి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆగ్రహం
పొంతనలేని సమాధానాలు ఇవ్వొద్దని వార్నింగ్ ఆనకట్టలకు
సంబంధించిన రికార్డులు స్వాధీనం ఇంజినీర్ల చేత సంతకాలు
క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు గల్లంతైనట్లు గుర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ చంద్ర ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కాళేశ్వ ర కమిషన్ విచారణ కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే సోమవారం మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డిఇఇ, ఎఇఇలను క మిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ విచారించారు. వి చారణలో ఎఇఇ, డిఇఇ ఇంజనీర్లపై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అ డిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి ముందుగా అనుకొని వచ్చి పొంతన లేని సమాధానాలు చెప్పొద్దు అని కమిషన్ చీఫ్ వ్యాఖ్యానించా రు. ఫీల్డ్‌లో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సంతకాలు చేసుకున్న కమిషన్ రిజిస్టర్లలో ఇంజనీర్ల చేత సంతకాలు తీసుకున్నారు. మేడిగడ్డ బ్లాక్ 7కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్‌లను సంతకా లు చేయించుకున్నారు.

కాళేశ్వరంలో జరిగిన ప నులపై ప్లేస్మెంట్ రికార్డులు రో జువారీగా చేశారా లేదా? ఒకరోజు పనిని
మరొక రోజు నమోదు చేశారని కమిషన్ ప్రశ్నించింది. కుంగిన పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ 7 రిజిస్టర్‌లపై ఇంజనీర్ల సంతకాలు కమిషన్ తీసుకుంది. 2020లోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజనీర్లు వెల్లడించారు. మొదటి డ్యామేజీ 2020లోనే జరిగినట్లు గుర్తించి లేఖలు రాసినట్లు కమిషన్ ముందు ఇంజనీర్లు చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు కమిషన్ గుర్తించింది. మేడిగడ్డ బ్లాక్ 7తో పాటు మూడు బ్యారేజీలకు సంబంధించిన వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్‌లను కాళేశ్వరం కమిషన్ స్వాధీనం చేసుకుంది. ఇంజినీర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ దాదాపు 18 మంది ఇంజినీర్లను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News