Saturday, October 5, 2024

డ్యాన్స్ అంటే చిరంజీవి.. చిరు అంటే డ్యాన్స్: సాయి ధరమ్ తేజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్‌కు తన మేనమామలు అంటే చాలా ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లు ఎదైనా సాధిస్తే చాలు సాయి ధరమ్ తేజ్ ఆనందానికి అవధులు అనేవి ఉండవు. వెంటనే స్పందించడంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపి అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన వెంటనే స్పందించారు. తేజ్‌కు సంతోషం ఎక్కువైతే విజిల్స్ వేస్తూ సందడి చేస్తాడు. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్‌కు గిన్నిస్‌బుక్‌ రికార్డులో చోటు దక్కడంతో తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో సాయి ధరమ్ తేజ్ స్పందించారు.

డ్యాన్స్ అంటే చిరంజీవి.. చిరు అంటే డ్యాన్స్ అని, ఊహ తెలిసాక తనకు తెలిసిన హీరో చిరంజీవేనని ప్రశంసించారు. డ్యాన్స్ అంటే ఆయన స్టెప్పులేనని, ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అరుదైన ఘట్టమని కొనియాడారు. చిరు డ్యాన్స్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడంతో ఆయన అభిమానులుు సంబరాలు చేసుకుంటున్నారు. మెగా అభిమానులు చిరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో మనం పర్ఫెక్ట్ గా నడిస్తే చాలు అనుకుంటామని, కానీ చిరు మాత్రం పర్ఫెక్ట్ గా డ్యాన్స్ చేస్తే చాలు అనుకుంటాడు.  తాము శివుడి నాట్యం చూడలేదు కానీ చిరు వేసిన డ్యాన్స్ మాత్రం శివుడి నాట్యమేనని నెటిజన్ సంతోష్ కుమార్ బోల్ల కొనియాడారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News