Saturday, May 24, 2025

సమరోత్సాహంతో పంజాబ్… నేడు ఢిల్లీతో పోరు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్ సీజన్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరుకు పంజాబ్ కింగ్స్ (DC vs PBKS) సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన ఇక అగ్రస్థానంపై దృష్టి సారించింది. పంజాబ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సింది. ఇందులో గెలిస్తే పంజాబ్‌కు టాప్2లో చోటు ఖాయమవుతోంది. రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో జయకేతనం ఎగుర వేసిన పంజాబ్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలిం గ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. అయితే కిందటి మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆర్య, మిఛెల్ ఓవెన్‌లు నిరాశ పరిచారు.

ప్రియాంశ్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, ఓవెన్ ఖాతా కూడా తెరవలేక పోయాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా 21 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సీజన్‌లో ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్‌లు అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరూ క్రీజులో నిలదొక్కుకుంటూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఢిల్లీపై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటు ప్రియాంశ్ అటు ప్రభ్‌సిమ్రన్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నారు. ఈసారి కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరాలనే పట్టుదలతో ఉన్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్‌తో ఆకట్టుకుంటున్నాడు.

అద్భుత కెప్టెన్సీతో పాటు బ్యాట్‌ను (DC vs PBKS) ఝులిపిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నెహాల్ వధెరా కూడా జోరుమీదున్నారు. కిందటి మ్యాచ్‌లో 37 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ జట్టులో ఉన్నాడు. శశాంక్ దూకుడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అజ్మతుల్లా, మార్కొ జాన్సన్‌లతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, యుజువేంద్ర చాహల్, మార్కొ జాన్సన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉండడంతో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News