Tuesday, May 6, 2025

హైదరాబాద్ లక్ష్యం 134

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉంచింది ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమీన్స్ దెబ్బకు 15 పరుగులకే ఢిల్లీ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ చెరో ఒక వికెట్ తీయడంతో 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో ట్రిస్టన్ స్టబ్స్(41), అశోతోష్ శర్మ(41) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమీన్స్ మూడు వికెట్లు తీయగా జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా తలో ఒక వికెట్ తీశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News