Saturday, June 3, 2023

ఆటోను ఢీకొన్న డిసిఎం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

వేములపల్లి: నల్గొండ జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన డిసిఎం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా… పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బాధితులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News