Tuesday, October 15, 2024

యువతిని 59 ముక్కలుగా నరికి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ యువతిని 59 ముక్కలుగా నరికి అనంతరం శరీర భాగాలను ప్రిజ్ లో పెట్టిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నెలమంగళ ప్రాంతంలో మహాలక్ష్మి అనే (29) యువతిని నివసిస్తోంది.  సదరు యువతిని ఓ దుండగుడు చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను ప్రిజ్ లో పెట్టాడు. ఆ ఇంట్లో నుంచి దర్వాసన రావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి సంబంధించిన ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఉండొచ్చని పోలీసులు తొలుత అనుమానాలు వ్యక్తం చేశారు. శవ పరీక్షలో మాత్ర 59 ముక్కలుగా నరికినట్లు తేలింది. ఆమె తలను మూడు ముక్కలుగా నరికాడని పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి శరీర భాగాన్ని నరికే సమయంలో అతడు రక్షస ఆనందం పోందాడని వైద్యులు పేర్కొన్నారు. నిందితుడు ‘సడోమా సూకిస్టిక్’ అనే నేర స్వభావంతో రగిలిపోతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. అతడిని పోలీసులు పట్టుకోకపోతే మరిన్ని హత్యలు చేసే అవకాశం ఉంది వైద్య నిపుణులు వివరించారు. యువతిని ఎవరు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో మల్లేశ్వరంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసేది. ఓ వ్యక్తి ఆమె పరిచయం కావడంతో ప్రేమగా మారిందని స్థానికులు తెలిపారు. ఆ వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అతడి కోసం పోలీసులు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News