Saturday, October 12, 2024

మీరట్‌లో భవనం కూలిన ఘటనలో పది మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పాత భవనం కుప్పకూలిన ఘటనలో పది మంది మృతి చెందారు. భారీ వర్షాల తరువాతి దశలో ఈ భనవం శనివారం కుప్పకూలింది. సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కిందనుంచి ఇప్పటికీ పది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల తొలిగింపు పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక్కరోజు గడిస్తే కానీ ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య గురించి స్పష్టత వచ్చే వీలులేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సత్వర ఉత్తర్వులతో సహాయక చర్యలను స్థానిక అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమన్వయపర్చుకుంటోంది.స్థానిక జకీర్‌నగర్‌లో జరిగిన ఈ భవనం ఘటనతో ఈ ప్రాంతం అంతా రెండు రోజులుగా విషాదం నెలకొంది. మృతులలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News