Friday, April 26, 2024

దశాబ్ది ఉత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పది కాలాల పాటు గుర్తుండేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో ప్రజా ప్రతినిధులు,అధికారులను, ప్రజలను గ్రామ స్థాయి వరకు భాగస్వామ్యులను చేస్తూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నియోజక ప్రత్యేకాధికారులు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, వ్యవసాయాధికారులు, ఆర్డీఓలు తదితర జిల్లా స్థాయి అధికారులతో ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 21 రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించుటకు అధికారులకు విధులు కేటాయించామని, ఆ మేరకు ఇటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రామాల విజయవంతానికి కృషిచేయాలన్నారు.

ప్రధానంగా రైతు సంక్షేమం, ఊరూరా మంచినీళ్ల పండుగ, సాగునీటి దినోత్సవం వంటి పెద్ద కార్యక్రమాలకు మొబిలైజషన్, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం వంటి వాటిలో జాగ్రత్తగా కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. జూన్ 3 న ప్రతి రైతు వేదికలను అలంకరించి వేయి మందితో సమావేశాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలతో పంట కాలం ఒక నెల ముందు జరుపుట పై అవగాహన కలిగించాలని, అభ్యుదయ రైతులు, రైతు భీమా లబ్ధిదారులతో మాట్లాడించాలని, అనంతరం సహపంక్తి భోజనం చేయాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలన్నారు. ఊరూరా చెరువుల పండుగ రోజు 469 గ్రామా పంచాయతీలలో పెద్ద చెరువుల వద్ద బతుకమ్మ,బోనాల, గోరెటి వెంకన్న పాటలు వినిపించాలని, చెరువు ప్రాంతాలను సుందరీకరించాలని, ప్రమాదాలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చూసుకోవాలని, డిన్నర్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.

సురక్ష దినోత్సవం నాడు సాయంత్రం వెల్కమ్ బోర్డు నుండి వైస్రాయ్ గార్డెన్ వరకు ర్యాలీ, సభ ఏర్పాట్లు చేయాలని, 12న యూవత్ తో నియోజక వర్గ స్థాయిలో తెలంగాణ రన్ నిర్వహించాలని పోలీసు సూచించారు. నాడు విద్యుత్ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని, అన్ని సబ్ స్టేషన్లను 21 రోజుల పాటు విద్యుద్దేకరించాలన్నారు. ముప్పిరెడ్డి పల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించాలని జిల్లా పరిశ్రమల అధికారికి సూచించారు. నియోజక వర్గ స్థాయిలో సాగునీటి దినోత్సవం చెక్ డాం ప్రాంతంలో నిర్వహించాలని, ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా ర్యాలీలు,డప్పులు,బోనాలతో చెరువుల వద్ద సభ, భోజనాలు ఏర్పాటు చేయాలని నీటిపారుదల అధికారులకు సూచించారు.

మంచినీళ్లపండుగ నాడు ప్రజాప్రతినిధులు, విలేకరులను హత్నూర మండలం బోర్పట్ల ఫిల్టర్ బెడ్ వద్దకు తీసుకెళ్లి నీటి శుద్ధ్దీకరణ పనులను వివరించాలని, భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. హరితోత్సవం నాడు అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి రోజున పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికులను, ఉత్తమ ఉద్యోగులను సన్మానించాలన్నారు. గిరిజన తాండాలు గ్రామాలుగా మారిన అని ప్రాంతాలలో గిరిజనోత్సవం నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్యం నాడు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందించాలని, విద్యా దినోత్సవం నాడు మన ఊరు మన బడి పాఠశాలలను, డిజిటల్ తరగతులను ప్రారంభించాలని, పిల్లలకు పాఠ్య పుస్తకాలు , నోటు పుస్తకాల, యూనిఫార్మ్ అందించాలన్నారు.ఆయా అధికారులు తమ తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు.ఈ సమావేశంలో ఇంచార్జి ఎస్పి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, నియోజక వర్గ ప్రత్యేకాధికారులు, ఆర్‌డిఓలు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమాధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News