Tuesday, May 7, 2024

తాడ్వాయిలో జింకల వేట… ఒకరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ములుగు జిల్లా తాడ్వాయి డివిజన్‌లోని బొల్లేపల్లి సౌత్ బీట్‌లో చుక్కల జింకను వేటాడిన ఉదంతం అటవీశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ట్రాప్ చేయగా ఒక వ్యక్తి పట్టుబడ్డారు. అతను ఉపయోగించిన వైర్‌ని , మచ్చల జింక చర్మంలో కొంత భాగాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయంపై దర్యాప్తు చేస్తుండగా ఈ నేరానికి పాల్పడిన 6 మంది వ్యక్తులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తున్నారు. నిందితులో ఒకరి  ఇంట్లో  నుండి ఎండబెట్టిన జింక మాంసాన్ని కూడా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు ఇటీవల క్యాచ్ ది ట్రాప్ అనే పేరుతో రాష్ట్రవ్యాప్త డ్రైవ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని కింద వేటకు ఉపయోగించే వలలు, ఉచ్చులు మొదలైన అన్ని రకాల పరికరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. అంతే కాకుండా ఇటీవల ఖమ్మంలోని కారేపల్లి గ్రామం నుండి కూడా మరో వ్యక్తి పై ఇలాగే కేసును నమోదు చేశారు. వన్యప్రాణులను వేటాడడం లేదా చంపడం వంటి సంఘటనలకు సంబంధించిన కేసులను 9803338666 లేదా 18004255364కు తెలియజేయాలని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News