- Advertisement -
ఐపిఎల్ సీజన్ 2025ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజా బ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. స్టోయినిస్ 44(నాటౌ ట్), కెప్టెన్ అయ్యర్ (53) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కరుణ్ (44), రాహుల్ (35), రిజ్వి 58(నాటౌట్) జట్టును గెలిపించారు.
- Advertisement -