Tuesday, March 5, 2024

ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళలే టార్గెట్.. డెలివరీ బాయ్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్న డెలివరీ బాయ్‌ను లంగర్‌హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆసిఫ్‌నగర్ ఎసిపి శివమారుతి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా, కామారెడ్డికి చెందిన సయిద్ హమీద్ హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బుతో హమీద్ అసంతృప్తిగా ఉన్నాడు. తను డెలివరీ చేస్తున్న సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు ధరించడం చూశాడు.

ఈ క్రమంలోనే నిందితుడు చోరీలకు ప్లాన్ వేశాడు. డెలివరీ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళల బంగారు ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆర్డర్ చేసిన మహిళ ఒంటరిగా ఇంట్లో ఉండడం గమనించిన నిందితుడు బాధితురాలిని కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న లంఘర్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, డిఐ ఎస్‌కె ముజీబ్ ఉర్ రెహ్మన్, డిఎస్సై రాఘవేంద్రస్వామి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News