Sunday, May 19, 2024

పాక్ ఆక్రమిత్ కశ్మీర్ ను కలుపుతామని వారే అంటారు: రాజ్ నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఓకె)పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఇండియా అయితే ఎలాంటి బలప్రయోగం చేయబోదు. కానీ అక్కడి ప్రజలే ఇండియాలో చేరుస్తామంటూ ముందుకొస్తారని అన్నారు. ఎందుకంటే భారత్ లో కశ్మీర్ ప్రగతిని చూసి వారా డిమాండ్ చేస్తారన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్య అక్కడే మొదలు కాగలదన్నారు.  ఆయన పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఒకప్పుడు మనది, ఇప్పటికీ అది మనదే, మనకే వస్తుంది’ అన్నారు. జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయి. కానీ ఎప్పడు అనేది ఇప్పడే చెప్పలేమన్నారు. జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. కనుక అక్కడ ‘అఫ్సా’ చట్టం అంత అవసరం లేదన్నారు. భారత్, పాకిస్థాన్ తో సత్సంబంధాలనే కోరుకుంటోందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News