Wednesday, May 1, 2024

దేశ వ్యాప్తంగా డెంగీ కలవరం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగీ నివారణ, నిర్మూలన చర్యలు పటిష్ఠం చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. డెంగీ నిర్మూలన, నియంత్రణతోపాటు నిర్వహణ చర్యలు పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 95 వేల డెంగీ కేసులు నమోదైనట్టు సమాచారం.

91 డెంగీ సంబంధిత మరణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్,ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక , గుజరాత్ , తెలంగాణ రాష్ట్రాల్లో డెంగీ కేసుల సంఖ్య భారీగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్క్రీనింగ్ కిట్లను ఇప్పటికే అందించిందని, ఫాగింగ్‌తోపాటు ఐఈసీ కార్యకలాపాలు కోసం ఆర్థిక సాయం అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆరోగ్యకార్యకర్తలకూ శిక్షణ ఇచ్చినట్టు తెలిపింది. ఈ కేసుల పర్యవేక్షణ, ల్యాబ్ పరీక్షలు, యాంటీజెన్‌టెస్ట్ కిట్ల సేకరణ వంటి తదితర కార్యక్రమ అమలు ప్రణాళిక కింద రాష్ట్రాలకు తగిన నిధులు అందుబాటులో ఉంచినట్టు మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News