Monday, April 29, 2024

నైరుతి రుతుపనాలు నిష్క్రమణ : ఐఎండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలం ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపనాలు నిష్క్రమిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో తెలంగాణా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుండి పూర్తిగా ఉపసంహరించుకోడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదారాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది.సోమవారం క్రింది స్థాయిలోని గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఖమ్మం జిల్లా ఏర్రుపాలెంలో 17.1మి.మీ, సింగరేణిలో 8.4, నేలకొండపల్లిలో 6.3 మి.మీ వర్షం కురిసింది. ధన్వాడలో 2.3, కుర్విలో 1.0 మి.మీ వర్షం కురిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News