Friday, September 13, 2024

పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి: డిప్యూటీ మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనాధిగా అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా మద్దతు లభించిందని, అందువల్ల ఆ బిల్లును ఆమోదించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ స్పష్టం చేశారు.

మహిళా బిల్లుకు ఆమోదం లభిప్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు, మహిళలకు విస్తృత అవకాశాలు లేకపోతే దేశ ప్రగతి కూడా సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లో సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News