Friday, June 20, 2025

#DadsCanToo కాంపైన్ తో డెట్టాల్ ఫాదర్స్ డే సంబరం

- Advertisement -
- Advertisement -

డెట్టాల్, క్రిముల నుండి రక్షించే భారతదేశపు ప్రముఖ బ్రాండ్, భాగస్వామ్య పేరెంటింగ్ ను సంబరం చేయడానికి తమ ప్రత్యేకమైన ఫాదర్స్ డే కాంపైన్ #DadsCanTooను ప్రారంభించింది. తమ శిశువుల కోసం డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ యొక్క నమ్మకమైన రక్షణతో అనుకూలమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని తయారు చేయడంలో కొత్తగా తండ్రులైన వారు ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టడానికి ప్రోత్సహించడమే ఈ కాంపైన్ లక్ష్యం. ఆధునిక పేరెంటింగ్ లో మరింత ఎక్కువగా సహకార ప్రయాణం ప్రమేయం ఉన్నందున, డెట్టాల్ కేవలం పరిశుభ్రత నిపుణుడిగా మాత్రమే కాకుండా, ఇంట్లో బాధ్యతలను కూడా పంచుకోవడాన్ని కూడా ప్రారంభించింది.

పేరెంటింగ్ బాధ్యతలు అభివృద్ధి చెందుతుండగా, శిశు సంరక్షణ బాధ్యతలు ఇప్పటికీ ప్రధానంగా తల్లలకే ఉంటున్నాయి. అయితే, తల్లులు శిశువులకు సంబంధించిన పనుల్లో కేవలం 6% మాత్రమే శారీరకంగా అవసరమవుతారు, తక్కిన 94% ఎవరైనా తుదకు నాన్నలు కూడా చేయవచ్చు. చాలామంది నాన్నలు బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నారు కానీ తరచుగా రోజూవారీ పనులకు సిద్ధంగా ఉండటం లేదు, ఇది ఆరంభంలోనే శిశువులతో సంబంధం ఏర్పడటాన్ని పరిమితి చేసి తల్లుల పై భారం కలిగిస్తోంది. సరైన మద్దతు మరియు చైతన్యంతో, తమ పిల్లల అభివృద్ధిలో నాన్నలు కూడా సమానమైన చురుకుదనంతో మరియు పెంపకం బాధ్యతను స్వీకరించవచ్చు.

డెట్టాల్ వారి #DadsCanToo డిజిటల్ కాంపైన్ రోజూవారీ శిశు సంరక్షణను తీసుకోవడంలో నాన్నలకు ఆత్మవిశ్వాసం మరియు ఆచరణాత్మకమైన విజ్ఞానం ఇవ్వడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాలని కోరుకుంటోంది. అనగా ఆ ప్రయాణంలో తమ నమ్మకమైన సహచరిగా డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ తో శిశువుల లాండ్రీ, ఉపరితలాలను డిస్ ఇన్ఫెక్ట్ చేయడం మరియు శిశువుల కోసం ఇంట్లో క్రిమిరహితమైన ప్రాంతాలను నిర్వహించడం. శిశువుల పెంపకం కేవలం ఆడవారికి మాత్రమే చెందిన పని కాదని మరియు నాన్నలు కూడా నిర్వహించవచ్చని డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ సంప్రదాయబద్ధమైన నియమాలను సవాలు చేస్తోంది. ఇది పేరెంటింగ్ కు భాగస్వామ విధానాన్ని ప్రోత్సహిస్తోంది, దీనిలో ఇద్దరు భాగస్వాములు చురుకుగా పాల్గొంటారు మరియు పరస్పరం మద్దతు చేసుకుంటారు.

కనిక కల్రా, రీజనల్ మార్కెటింగ్ డైరెక్టర్, హెల్త్, రెకిట్- దక్షిణాసియా, ఇలా అన్నారు, “రెకిట్ లో, మేము చేసే ప్రతి పనిలో ప్రజల జీవితాలు మరియు అవసరాలను ఉంచుతాము. వినియోగదారులకు మెరుగ్గా సేవలు అందించడానికి మరియు వారి జీవితాలను మెరుగుపరచడానికి మేము వారు చెప్పింది వింటాము. #DadsCanToo కాంపైన్ తో, శిశు సంరక్షణలో ముఖ్యంగా పరిశుభ్రతను నిర్వహించడంలో డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ యొక్క నమ్మకమైన రక్షణ ద్వారా నాన్నలు ఆత్మవిశ్వాసంతో పాల్గొనేలా సమర్థవంతుల్ని చేయడానికి మేము భాగస్వామ్య పేరెంటింగ్ ను గర్వంగా ప్రోత్సహిస్తున్నాం. పేరెంటింగ్ అనేది భాగస్వామ్యం అని మేము బలంగా విశ్వసిస్తున్నాం. నాన్నలు గొప్పగా పాల్గొనడాన్ని ప్రోత్సహించడానికి, తల్లులపై ఒత్తిడ్ని తగ్గించడానికి, మరింత సమతుల్యమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన పేరెంటింగ్ పట్ల సాంస్కృతిక మార్పు కోసం మేము చేస్తున్న ప్రయత్నమే ఈ కాంపైన్.“

లియో ఇండియా రూపొందించిన ఈ హృదయాన్ని తాకే కాంపైన్ ఫిల్మ్ సందిగ్ధం నుండి ఆత్మవిశ్వాసం వరకు నాన్నల ప్రయాణాన్ని చూపిస్తుంది. నితిన్ ప్రధాన్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, క్రియేటివ్ హెడ్- ఢిల్లీ, ఇలా అన్నారు, “నాన్నలకు ఉద్దేశ్యం ఉంది కానీ వారికి సాంస్కృతికపరమైన అనుమతి లోపించిందని మేము చూసాము. ఈ కాంపైన్ వారికి ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టే ఆ అనుమతిని ఇచ్చింది. ఇది అమ్మల స్థానాన్ని మార్చడం లేదు, ఇది వారితో పాటు కలిసి పని చేయడం గురించి. నాన్నలు ముందస్తుగా ప్రవేశిస్తే, అమ్మలు అలసిపోరు. అదే సమతుల్యత. అది భాగస్వామ్యతో కూడిన పేరెంటింగ్. నిజాయితీగా చెప్పాలంటే, మేము ఒక కొత్త రకం నాన్నని ఆవిష్కరించడం లేదు – చురుకుగా లేని వారిని మేము కేవలం ఆహ్వానిస్తున్నాం.”

#DadsCanToo కాపైన్ పరిశుభ్రత భావనకు మించినది, నాన్నలకు సంరక్షణ మరియు ఆత్మవిశ్వాసం రెండిటిని కలిగించడం ద్వారా పేరెటింగ్ లో సమానత్వాన్ని కలగచేస్తోంది. ఈ ఫాదర్స్ డేకి, డెట్టాల్ నాన్నలు చేస్తున్న పనుల కోసం కాకుండా వారు ఆత్మవిశ్వాసంతో, సమానంగా, హృదయపూర్వకంగా ఏంటి చేయగలరు విషయం కోసం నాన్నలను సంబరం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News